సోమవారం 25 జనవరి 2021
Sports - Jan 04, 2021 , 09:11:35

క్రికెట‌ర్స్‌తో పాటు సిబ్బందికి క‌రోనా నెగెటివ్

క్రికెట‌ర్స్‌తో పాటు సిబ్బందికి క‌రోనా నెగెటివ్

భార‌త వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌, నవ్‌దీప్‌ సైనీ, పృథ్వీ షా  బ‌యో సెక్యూరిటీ ప్రోటోకాల్‌ని ఉల్లంఘించ‌డంతో వారిని  ఐసొలేషన్‌కు పంపినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. మెల్‌బోర్న్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్ళిన ఐదుగురు క్రికెట‌ర్స్   భోజనం చేస్తుండగా.. పక్క టేబుల్‌పైన ఉన్న నవల్‌దీప్‌ సింగ్‌ అనే అభిమాని వీరి బిల్లు చెల్లించాడు. ఇందుకు గాను రిషబ్ పంత్‌.. న‌వ‌ల్‌దీప్‌ని హ‌గ్ చేసుకున్న‌ట్టు బీసీసీఐ గుర్తించ‌డంతో ఐదుగురిని ఐసోలేష‌న్‌కు పంపారు.

తాజాగా రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌, నవ్‌దీప్‌ సైనీ, పృథ్వీ షాల‌తో పాటు మిగ‌తా ఇండియన్ క్రికెట‌ర్స్‌, సిబ్బందికి ఆర్‌పీసీఆర్ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా అంద‌రికి నెగెటివ్ అని తేలింది.  దీంతో అంద‌రు ఊపిరి పీల్చుకున్నారు. జ‌న‌వ‌రి 7 నుండి మూడో టెస్ట్ జ‌ర‌గ‌నుండ‌గా, దీని కోసం ఇరు జ‌ట్లు తీవ్ర క‌స‌ర‌త్తులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జ‌ట్లు ఒక్కో మ్యాచ్ గెలిచి సిరీస్ స‌మం చేసిన విష‌యం తెలిసిందే. 


logo