బుధవారం 27 జనవరి 2021
Sports - Dec 28, 2020 , 12:36:13

ఆస్ట్రేలియా ఆధిక్యం 2 ప‌రుగులు.. చేతిలో 4 వికెట్లు

ఆస్ట్రేలియా ఆధిక్యం 2 ప‌రుగులు.. చేతిలో 4 వికెట్లు

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా విజ‌యం వైపు అడుగులు వేస్తోంది. ఒక ద‌శ‌లో ఇన్నింగ్స్ విజయం సాధించేలా క‌నిపించినా.. కామెరూన్ గ్రీన్‌, క‌మిన్స్ వికెట్ల ప‌తనాన్ని అడ్డుకోవ‌డంతో ఆస్ట్రేలియా ఆధిక్యంలోకి వెళ్లింది. మూడోరోజు ఆట ముగిసే స‌మ‌యానికి కంగారూలు 6 వికెట్ల‌కు 133 ప‌రుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 131 ప‌రుగుల ఆధిక్యాన్ని తీసేస్తే.. ప్ర‌స్తుతం ఆ టీమ్ 2 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. గ్రీన్ (17), క‌మిన్స్ (15) ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. 

ఒక ద‌శ‌లో 99 ప‌రుగుల‌కే ఆరు వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ ఓట‌మి బాట‌లో ప‌య‌నించిన ఆసీస్‌ను ఈ ఇద్ద‌రూ ఆదుకున్నారు. టీమిండియా బౌల‌ర్ల‌లో జ‌డేజా 2 వికెట్లు తీయ‌గా.. బుమ్రా, ఉమేష్‌, సిరాజ్‌, అశ్విన్ త‌లా ఒక వికెట్ తీసుకున్నారు. మాథ్యూ వేడ్ 40 ప‌రుగులు చేయ‌గా.. లాబుషేన్ 28, హెడ్ 17 ప‌రుగులు చేశారు. ప్ర‌స్తుతం మ్యాచ్‌లో టీమిండియాదే పైచేయి అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. నాలుగో రోజే మ్యాచ్ ముగిసే అవ‌కాశాలు ఉన్నాయి. logo