ఆదివారం 07 మార్చి 2021
Sports - Feb 16, 2021 , 12:53:42

డ‌బ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌.. రెండోస్థానానికి దూసుకెళ్లిన టీమిండియా

డ‌బ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌.. రెండోస్థానానికి దూసుకెళ్లిన టీమిండియా

చెన్నై: ఇంగ్లండ్‌తో జ‌రిగిన రెండో టెస్ట్‌లో ఘ‌న విజ‌యం సాధించిన టీమిండియా.. వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ర్యాంకింగ్స్‌లో నాలుగు నుంచి రెండోస్థానానికి దూసుకెళ్లింది. అటు తొలి టెస్ట్ గెలిచిన త‌ర్వాత టాప్‌లోకి వెళ్లిన ఇంగ్లండ్‌.. ఈ ఓట‌మితో నాలుగోస్థానానికి ప‌డిపోయింది. దీంతో ఫైన‌ల్ రేసు ఆస‌క్తిక‌రంగా మారుతోంది. సౌతాఫ్రికాలో ఆస్ట్రేలియా త‌న ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకోవ‌డంతో ఇప్ప‌టికే న్యూజిలాండ్ ఫైన‌ల్ చేరిన విష‌యం తెలిసిందే. 

మ‌రో బెర్త్ కోసం ఇండియా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా పోటీ ప‌డుతున్నాయి. ఈ సిరీస్‌ను టీమిండియా క‌నీసం 2-1తో గెలిచినా ఫైన‌ల్‌కు వెళ్తుంది. అదే ఇంగ్లండ్ ఫైన‌ల్ చేరాలంటే మిగిలిన రెండు టెస్టులు క‌చ్చితంగా గెల‌వాల్సి ఉంటుంది. ఒక‌వేళ సిరీస్ డ్రా అయితే ఈ రెండు టీమ్స్ కాకుండా ఆస్ట్రేలియా ఫైన‌ల్‌కు వెళ్తుంది. ఈ ఈక్వేష‌న్ల‌తో ఐసీసీ తొలిసారిగా ప్ర‌వేశ‌పెట్టిన వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ రేసు చాలా ఆస‌క్తిక‌రంగా మారింది. 

VIDEOS

logo