మంగళవారం 02 మార్చి 2021
Sports - Feb 08, 2021 , 17:10:51

టార్గెట్ 420.. టీమిండియా 39/1

టార్గెట్ 420.. టీమిండియా 39/1

చెన్నై: ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా గ‌ట్టెక్క‌డానికి పోరాడుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ న‌ష్టానికి 39 ప‌రుగులు చేసింది. మ‌రో నాలుగు ఓవ‌ర్లు మిగిలి ఉండ‌గానే నాలుగో రోజు ఆట ముగిసింది. 420 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియా.. త్వ‌ర‌గానే రోహిత్ (12) వికెట్ కోల్పోయింది. ప్ర‌స్తుతం క్రీజులో పుజారా (12), శుభ్‌మ‌న్ గిల్ (15) ఉన్నారు. మ‌రో రోజు ఆట మిగిలి ఉన్న నేప‌థ్యంలో ఇంగ్లండ్ 9 వికెట్ల కోసం చూస్తుండ‌గా.. ఇండియా క‌నీసం డ్రా అయినా చేసుకోవాల‌ని భావిస్తోంది. విజ‌యానికి టీమిండియా ఇంకా 381 ప‌రుగుల దూరంలో ఉంది. చివ‌రి రోజు ఇన్ని ప‌రుగులు చేయ‌డం దాదాపు అసాధ్యం. 

అంత‌కుముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 178 ప‌రుగుల‌కే ఆలౌటైన విష‌యం తెలిసిందే. అశ్విన్ 6 వికెట్లు తీసుకున్నాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగుల‌కు ఆలౌట్ కావ‌డంతో ఇంగ్లండ్‌కు 241 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. మొత్తంగా 419 ప‌రుగుల లీడ్ సాధించింది. 

VIDEOS

logo