గురువారం 25 ఫిబ్రవరి 2021
Sports - Jan 19, 2021 , 10:21:40

కావాల్సిన‌వి 145 ప‌రుగులు.. చేతిలో 7 వికెట్లు

కావాల్సిన‌వి 145 ప‌రుగులు.. చేతిలో 7 వికెట్లు

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా ప‌టిష్ఠ‌మైన స్థితిలో నిలిచింది. చివ‌రి రోజు టీ స‌మ‌యానికి 3 వికెట్ల‌కు 183 ప‌రుగులు చేసింది. మ‌రో సెష‌న్ మాత్ర‌మే మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో టీమిండియా విజ‌యానికి 145 ప‌రుగుల దూరంలో ఉంది. మ‌రో 37 ఓవ‌ర్లు ఉన్నాయి. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. ప్ర‌స్తుతం క్రీజులో పుజారా (43), రిష‌బ్ పంత్ (10) ఉన్నారు. ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ 91 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. కెప్టెన్ ర‌హానే (24) మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లు షార్ట్ బాల్స్‌తో బెంబేలెత్తిస్తున్నా పుజారా మొక్క‌వోని ప‌ట్టుద‌ల‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. చివ‌రి రోజు ఉద‌యం నుంచీ ఆసీస్ బౌల‌ర్లు వేసిన షార్ట్ బాల్స్ పుజారాను చాలాసార్లు గాయ‌ప‌రిచాయి.  32 ఏళ్లుగా బ్రిస్బేన్‌లో ఓట‌మెరుగ‌ని ఆస్ట్రేలియా.. ప్ర‌స్తుతం డిఫెన్స్‌లో ప‌డిపోయింది. ఈ మ్యాచ్‌లో గెలిచినా, డ్రా చేసుకున్న బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ ఇండియా సొంత‌మ‌వుతుంది. 


VIDEOS

logo