బుధవారం 03 జూన్ 2020
Sports - Apr 04, 2020 , 22:30:56

వైర‌స్‌ను త‌రిమికొడ‌దాం: బుమ్రా

వైర‌స్‌ను త‌రిమికొడ‌దాం: బుమ్రా

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి వ్యాప్తిని అరిక‌ట్టేందుకు జ‌రుగుతున్న పోరాటంలో.. ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని క్రీడాకారుల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సూచించిన నేప‌థ్యంలో ఆట‌గాళ్లంతా ముందుకు వ‌స్తున్నారు. వివిధ క్రీడారంగాల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖుల‌తో మోదీ శుక్ర‌వారం వీడియో కాన్ఫ్‌రెన్స్ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే  క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ నుంచి.. స్టార్ స్ప్రింట‌ర్ హిమాదాస్ వ‌ర‌కు త‌మ వంతుగా అవ‌గాహ‌న చేప‌డుతుండ‌గా.. తాజాగా ఈ జాబితాలో టీమ్ఇండియా స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా కూడా చేరిపోయాడు. 

`భార‌త అభిమానులంతా మొబైల్ ఫ్లాష్‌లైట్లు చేత‌బ‌ట్టండి. టీమ్ఇండియా మైదానంలో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్న సంద‌ర్భంలో ఎలాంటి ఉత్సాహాన్నైతే క‌న‌బ‌రుస్తారో.. మ‌హ‌మ్మారిపై పోరులోనూ అచ్చం అలాగే  స్పందించండి. మీ జోరుతో వైర‌స్ స్టేడియం అవ‌త‌లికి త‌రిమికొట్టంది. ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు 9 నిమిషాల పాటు విద్యుత్ దీపాలు ఆర్పి కొవ్వ‌త్తులు వెలిగించి మీ సహ‌కారాన్ని చాటండి` అని బుమ్రా ట్వీట్ చేశాడు. 


logo