శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Sports - Feb 07, 2021 , 17:11:16

ఫాలోఆన్ దిశ‌గా టీమిండియా.. 257/6

ఫాలోఆన్ దిశ‌గా టీమిండియా.. 257/6

చెన్నై: ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా ఫాలో ఆన్ దిశ‌గా అడుగులు వేస్తోంది. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల‌కు 257 ప‌రుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే ఇంకా 321 ప‌రుగులు వెనుక‌బ‌డే ఉంది. ప్ర‌స్తుతం క్రీజులో వాషింగ్ట‌న్ సుంద‌ర్ (33), అశ్విన్ (8) ఉన్నారు. ఒక ద‌శ‌లో 73 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన టీమ్‌ను పంత్ (91), పుజారా (73) ఆదుకున్నారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఐదో వికెట్‌కు 119 ప‌రుగులు జోడించారు. ముఖ్యంగా పంత్ టీ20 ఇన్నింగ్స్‌ను త‌ల‌పిస్తూ.. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో ఇంగ్లండ్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. ఈసారి ఇండియాలో తొలిసారి సెంచ‌రీ చేయ‌డం ఖాయం అనుకున్న స‌మ‌యంలో 91 ప‌రుగులు ద‌గ్గ‌ర ఔట‌య్యాడు. 88 బంతుల్లోనే 5 సిక్స‌ర్లు, 9 ఫోర్ల‌తో పంత్ 91 ప‌రుగులు చేయ‌డం విశేషం. ఇంగ్లండ్ బౌల‌ర్లలో కొత్త స్పిన్న‌ర్ డోమ్ బెస్ 4, జోఫ్రా ఆర్చ‌ర్ 2 వికెట్లు తీసుకున్నారు. 

VIDEOS

logo