శనివారం 16 జనవరి 2021
Sports - Jan 13, 2021 , 09:42:25

డేంజ‌ర్‌లో టీమిండియా.. హోట‌ల్ ప‌క్క‌నే కొత్త క‌రోనా కేసులు!

డేంజ‌ర్‌లో టీమిండియా.. హోట‌ల్ ప‌క్క‌నే కొత్త క‌రోనా కేసులు!

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్ట్ ఆడ‌టానికి బ్రిస్బేన్ వెళ్లిన ఇండియ‌న్ టీమ్ స‌భ్యుల‌ను క‌ఠిన‌మైన క్వారంటైన్‌లో ఉంచారు అక్క‌డి అధికారులు. టీమ్ ఉంటున్న హోట‌ల్ ద‌గ్గ‌ర‌లోనే ఉన్న గ్రాండ్ చాన్సెల‌ర్ హోట‌ల్లో రెండు ప్ర‌మాద‌క‌ర యూకే వేరియంట్ క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో ఉలిక్కి ప‌డిన అధికారులు.. టీమ్‌ను అస‌లు బ‌య‌ట‌కు రాకుండా చూసుకుంటున్నారు. ఈ నెల 15న నాలుగో టెస్ట్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. రెండు కొత్త క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డ‌టంతో ఆ హోట‌ల్లో ఉన్న సుమారు 250 మంది గెస్ట్‌ల‌ను అక్క‌డి క్వీన్స్‌ల్యాండ్ ప్ర‌భుత్వం మ‌రో హోట‌ల్‌కు త‌ర‌లించింది. మ‌రోవైపు చివ‌రి టెస్ట్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా 50 శాతం మంది ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించింది. అయితే మ్యాచ్ చూడ‌టానికి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రూ మాస్కులు క‌చ్చితంగా ధ‌రించాల‌ని స్ప‌ష్టం చేసింది. 

క్వీన్స్‌ల్యాండ్‌లో అమ‌ల్లో ఉన్న క‌ఠిన క్వారంటైన్ నిబంధ‌న‌ల నేప‌థ్యంలో అస‌లు బ్రిస్బేన్ వెళ్ల‌డానికే టీమిండియా ఇష్ట‌ప‌డ‌ని సంగ‌తి తెలిసిందే. అయితే చివ‌రికి బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా మ‌ధ్య చ‌ర్చ‌ల‌తో చివ‌రికి బ్రిస్బేన్ వెళ్ల‌డానికి టీమ్ అంగీక‌రించింది. కానీ హోట‌ల్‌కు వెళ్లిన త‌ర్వాత కూడా అక్క‌డ క‌నీస స‌దుపాయాలు కూడా ఇవ్వ‌డం లేద‌ని టీమ్ స‌భ్యులు ఫిర్యాదు చేశారు. జిమ్‌, స్విమ్మింగ్ పూల్ కూడా వాడుకోనీయడం లేదంటూ ఫిర్యాదు చేయ‌డంతో మ‌ళ్లీ బీసీసీఐ రంగంలోకి దిగాల్సి వ‌చ్చింది. బోర్డు అధ్యక్షుడు గంగూలీ, కార్య‌ద‌ర్శి జే షా ఎప్ప‌టిక‌ప్పుడు టీమ్‌తో ట‌చ్‌లో ఉంటున్నారు.