శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Nov 13, 2020 , 00:48:12

కంగారూల గడ్డపై కోహ్లీసేన

 కంగారూల గడ్డపై కోహ్లీసేన

సిడ్నీ: రెండు నెలల సుదీర్ఘ పర్యటన కోసం విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని టీమ్‌ఇండియా కంగారూల గడ్డపై అడుగుపెట్టింది. మొత్తం 25 మందితో కూడిన భారత బృందం గురువారం మధ్యాహ్నం ఇక్కడకు చేరుకుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో టీమ్‌ఇండియా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటూ ప్రాక్టీస్‌ చేయనుంది. నగర పరిసరాల్లో  పుల్‌మన్‌ హోటల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బయోబబుల్‌లో క్రికెటర్లకు వసతి కల్పించారు. ఆస్ట్రేలియా రగ్బీ దిగ్గజం బ్రాడ్‌ ఫిట్లర్‌ బస చేసే పెంట్‌హౌజ్‌ సూట్‌ను కోహ్లీకి కేటాయించే అవకాశముందని స్థానిక వార్త సంస్థలు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే 1992 ప్రపంచకప్‌లో అప్పటి భారత జట్టు ధరించిన నెవీ బ్లూ జెర్సీని కొత్త కిట్‌ స్పాన్సర్‌ ఎమ్‌పీఎల్‌ రూపొందించే అవకాశమున్నట్లు తెలిసింది. ఇది జరిగితే కొత్త జెర్సీలో కోహ్లీసేనను చూసే చాన్స్‌ లభిస్తుంది.