Sports
- Nov 28, 2020 , 14:35:54
టీమిండియాకు జరిమానా

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియా ప్లేయర్స్‌కు జరిమానా విధించారు. ఒక్కో ప్లేయర్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడనుంది. దీనిపై అధికారికంగా విచారణ జరపాల్సిన అవసరం లేదని, కెప్టెన్ విరాట్ కోహ్లి తన తప్పును ఒప్పుకున్నాడని శనివారం ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. టీమిండియా నిర్ణీత సమయంలో ఒక ఓవర్ తక్కువగా వేసింది. దీంతో ఐసీసీ మ్యాచ్ రిఫరీల ఎలైట్ ప్యానెల్‌కు చెందిన డేవిడ్ బూన్ ఈ జరిమానా విధించినట్లు ఐసీసీ ఆ ప్రకటనలో వెల్లడించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.22 ప్రకారం ఒక టీమ్ తక్కువగా వేసే ప్రతి ఓవర్‌కు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు. తొలి వన్డేలో 66 పరుగులతో పరాజయం పాలైన కోహ్లి సేన అదే వేదికలో ఆదివారం రెండో వన్డే కోసం సిద్ధమవుతోంది.
తాజావార్తలు
- హస్తిన సరిహద్దుల్లో అదనపు బలగాలు!
- హర్యానా, పంజాబ్‌ల్లో హైఅలర్ట్
- వ్యాక్సిన్ కోసం కెనడా సంస్థ సీఈవో కొలువు ఖల్లాస్
- ఉరేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
- సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం
- ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం..83 మంది పోలీసులకు గాయాలు
- కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిక
- మహవీర్ చక్రతో వందశాతం సంతృప్తి చెందట్లేదు: సంతోష్ తండ్రి
- అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
- నూతన సచివాలయం, అమరవీరుల స్మారకంపై మంత్రి వేముల సమీక్ష
MOST READ
TRENDING