గురువారం 21 జనవరి 2021
Sports - Jan 01, 2021 , 13:06:13

టీమిండియా న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌

టీమిండియా న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండో టెస్ట్‌లో ఘ‌న విజ‌యం సాధించిన టీమిండియా న్యూఇయ‌ర్‌ను గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకుంది. మెల్‌బోర్న్‌లో ఉంటూ మూడో టెస్ట్‌కు సిద్ధ‌మ‌వుతున్న టీమ్.. మ‌ధ్య‌లో దొరికిన రెండు రోజుల హాలీడేను బాగా ఎంజాయ్ చేసింది. ఈ సెల‌బ్రేష‌న్స్ ఫొటోను ట్విట‌ర్‌లో షేర్ చేసిన కేఎల్ రాహుల్‌.. న్యూ ఇయ‌ర్‌, న్యూ ఫీల్స్‌, న్యూ చాన్సెస్‌, సేమ్ డ్రీమ్స్‌, ఫ్రెష్ స్టార్ట్స్ అంటూ కామెంట్ చేశాడు. 

అటు రెండో టెస్ట్‌లో టీమ్‌కు అద్భుత విజ‌యం సాధించి పెట్టిన స్టాండిన్ కెప్టెన్ అజింక్య ర‌హానే కూడా న్యూ ఇయ‌ర్ విషెస్ చెప్పాడు. కోట్లాది మంది ఇండియ‌న్స్ ముఖాల్లో ఆనందం వెల్లివిరిసేలా చేసే అవ‌కాశం రావ‌డ‌మే ఓ టీమ్‌గా త‌మ‌కు ద‌క్కిన అద్భుత‌మైన రివార్డు అని, ఇలాగే మీ మ‌ద్ద‌తు కొన‌సాగాల‌ని ర‌హానే ఆశించాడు.

తాజావార్తలు


logo