బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Feb 21, 2020 , 17:09:48

రాస్‌ టేలర్‌కు వంద వైన్‌ బాటిళ్లు..

రాస్‌ టేలర్‌కు వంద వైన్‌ బాటిళ్లు..

హైదరాబాద్‌:  న్యూజిలాండ్‌ క్రికెటర్‌ రాస్‌ టేలర్‌ చరిత్ర సృష్టించాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌లో అతను వందేసి మ్యాచ్‌లు ఆడాడు. ఇవాళ భారత్‌తో వెల్లింగ్టన్‌లో ప్రారంభమైన టెస్టు మ్యాచ్‌తో అతను ఈ ఘనతను అందుకున్నాడు. అరుదైన రికార్డును చేరుకున్న తొలి క్రికెటర్‌గా అతను నిలిచాడు.  35 ఏళ్ల టేలర్‌.. గత నెలలోనే టీ20ల్లో వందవ మ్యాచ్‌ ఆడాడు.  ఇప్పటి వరకు టేలర్‌ 231 వన్డేల్లో ఆడాడు. కివీస్‌ టీమ్‌లో అత్యధిక రన్స్‌ చేసిన క్రికెటర్‌గా నిలిచాడు.  టెస్టుల్లో టేలర్‌ 7174, వన్డేల్లో 8570 రన్స్‌ చేశాడు. ఇక టీ20ల్లో అతను 1909 రన్స్‌ చేశాడు.   2007లో టేలర్‌ తొలి టెస్టు మ్యాచ్‌ను ఆడాడు. వంద టెస్టులు ఆడిన రాస్‌ టేలర్‌కు.. కివీస్‌ అద్భుతమైన బహుమతిని ఇచ్చింది. టేలర్‌కు వంద వైన్‌ బాటిళ్లను ప్రజెంట్‌ చేశారు. ప్రతి టెస్టుకు ఒక బాటిల్‌ అన్న ఉద్దేశంతో అతనికి వాటిని అందజేశారు. ఆ దేశ మాజీ ప్లేయర్‌ ఇయాన్‌ స్మిత్‌ వాటిని బహుకరించాడు. 


logo