శుక్రవారం 15 జనవరి 2021
Sports - Dec 27, 2020 , 00:18:23

హైదరాబాద్‌ కెప్టెన్‌గా తన్మయ్‌

హైదరాబాద్‌ కెప్టెన్‌గా తన్మయ్‌

హైదరాబాద్‌, ఆట ప్రతినిధి: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ కోసం హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) శనివారం జట్టును ప్రకటించింది. తన్మయ్‌ అగర్వాల్‌ కెప్టెన్‌గా, బవనక సందీప్‌ వైస్‌ కెప్టెన్‌గా 20 మందితో జట్టును ఎంపిక చేసింది. నిలకడగా రాణిస్తున్న యువ క్రికెటర్లు ఠాకూర్‌ తిలక్‌వర్మ,  త్యాగరాజన్‌, మికిల్‌ జైస్వాల్‌కు జట్టులో చోటు లభించింది. వచ్చే నెల 10 నుంచి కోల్‌కతాలో హైదరాబాద్‌ జట్టు మ్యాచ్‌లు ఆడనుంది.