బుధవారం 27 జనవరి 2021
Sports - Dec 21, 2020 , 01:09:25

పారా సైక్లిస్టుల యాత్ర స్ఫూర్తిదాయకం

 పారా సైక్లిస్టుల యాత్ర స్ఫూర్తిదాయకం

  • గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ 

హైదరాబాద్‌, ఆట ప్రతినిధి: కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు పారా సైక్లిస్టులు చేపట్టిన యాత్ర అందరికీ స్ఫూర్తిదాయకమని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ అన్నారు. భారత తొలి పారా సైక్లిస్టు ఆదిత్య మెహతాకు చెందిన ఫౌండేషన్‌ (ఏఎంఎఫ్‌) ఆధ్వర్యంలో సాగుతున్న ఇన్ఫినిటీ రైడ్‌ ఆదివారం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా సైక్లిస్టులకు ఘన స్వాగతం పలికిన అనంతరం పచ్చజెండా ఊపి చివరి అంచె యాత్రను గవర్నర్‌ ప్రారంభించారు. పారా సైక్లిస్టుల ధైర్యం, ఉత్సాహం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమానికి సినీ నటీమణులు రెజీనా కసాండ్ర, మంచు లక్ష్మీ, నిర్మాత శోభు యార్లగడ్డ హాజరయ్యారు. 


logo