చాంపియన్ తమిళనాడు

- సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ కైవసం
- తమిళ బౌలర్ సిద్ధార్థ్ విజృంభణ.. ఫైనల్లో బరోడా చిత్తు
అహ్మదాబాద్: దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని తమిళనాడు కైవసం చేసుకుంది. టోర్నీ ఆరంభ సీజన్ (2006-07)లో విజేతగా నిలిచిన తమిళ జట్టు దాదాపు 15 ఏండ్ల విరామం తర్వాత మరోసారి చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం ఇక్కడి మొతెరా మైదానంలో జరిగిన ఫైనల్లో తమిళనాడు 7 వికెట్ల తేడాతో బరోడాపై విజయం సాధించింది. తమిళ బౌలర్ మణిమరన్ సిద్ధార్థ్ (4/20) విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓ దశలో 36 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయినా విష్ణు సొలాంకి (49) పోరాడడంతో ఆ జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. స్వల్ప లక్ష్యాన్ని తమిళనాడు రెండు ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. ఓపెనర్ హరి నిశాంత్ (35), బాబా అపరాజిత్ (29 నాటౌట్), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (22) భాగస్వామ్యాలతో 18 ఓవర్లలో తమిళ టీమ్ మూడు వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. సిద్ధార్థ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
స్టార్లు దూరమైనా..
ప్రముఖ ఆటగాళ్లు జట్టుకు దూరమైనా తమిళనాడు అదరగొట్టింది. టీమ్ఇండియా విధుల్లో బిజీగా ఉన్న అశ్విన్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, సందీప్ వారియర్ (నెట్ బౌలర్) జట్టుకు అందుబాటులో లేరు. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా, ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ పెళ్లి వల్ల ఆడలేకపోయారు. అయినా సీనియర్ ప్లేయర్ దినేశ్ కార్తీక్ సారథ్యంలోని తమిళనాడు సత్తాచాటింది. గతేడాది ఫైనల్లో అందినట్టే అంది చేజారిన టైటిల్‌ను ఈసారి పట్టేసింది. ఈ ఏడాది టోర్నీ మొత్తం అజేయంగా నిలిచి నిజమైన విజేతగా అవతరించింది. దినేశ్ కార్తీక్ సారథ్యంలో తమిళనాడు రెండోసారి సయ్యద్ ముస్తాక్ ట్రోఫీని దక్కించుకుంది. 2006-07లోనూ అతడి కెప్టెన్సీలోనే టైటిల్ చేజిక్కించుకుంది.
సంక్షిప్త స్కోర్లు:
బరోడా: 20 ఓవర్లలో 120/9 (విష్ణు సొలాంకి 49, అతిత్ సేత్ 29; ఎం సిద్ధార్థ్ 4/20).
తమిళనాడు: 18 ఓవర్లలో 123/3 (హరి నిశాంత్ 35, బాబా అపరాజిత్ 29 నాటౌట్; అతిత్ 1/20, షరీఫ్ 1/23)
తాజావార్తలు
- వేగవంతంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ
- మెగా హీరో సినిమాలో బిగ్ బాస్ భామ..!
- టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఉర్దూ టీచర్స్ మద్దతు
- యాదాద్రిలో ఆలయ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న సీఎం
- స్కామ్ 1992 సెకండ్ సీజన్ ఏంటో తెలుసా?
- దీదీకే మా సంఘీభావం: శివసేన
- ఆఫ్ఘనిస్తాన్‌లో కాల్పలు.. ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి
- ప్రైవేట్ వీడియో లీక్ చేస్తామని బెదిరింపులు : నటుడి అసిస్టెంట్ బలవన్మరణం
- టీకా తీసుకున్న మాజీ ప్రధాని, కేంద్ర మంత్రి నిర్మల
- ఇండియన్ నేవీలో చేరిన ఐఎన్ఎస్ విక్రాంత్.. చరిత్రలో ఈరోజు