న్యూఢిల్లీ: ఇప్పుడు ప్రపంచం దృష్టంతా ఆఫ్ఘనిస్థాన్.. అక్కడ తాలిబన్ల( Taliban ) పాలనపైనే ఉంది. ప్రతి రోజూ తాలిబన్ల గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. అయితే ఈసారి ఇండియాలో ఉన్న తాలిబన్ క్రికెట్ టీమ్ వార్తల్లో నిలిచింది. ఇండియా ఏంటి.. ఇక్కడ తాలిబన్ క్రికెట్ టీమ్ ఏంటి అని ఆశ్చర్యం కలుగుతోందా? నిజంగానే రాజస్థాన్‌లో తాలిబన్ క్రికెట్ క్లబ్ పేరుతో ఓ టీమ్ ఉంది. ఆ రాష్ట్రంలోని జైసల్మేర్‌లో ఉన్న భనియానా గ్రామంలో జరుగుతున్న టోర్నీలో ఈ క్లబ్ ఓ మ్యాచ్ కూడా ఆడింది. అయితే ఆ తర్వాత ఈ క్లబ్ పేరుపై వివాదం చెలరేగడంతో నిర్వాహకులు ఆ టీమ్‌పై నిషేధం విధించారు.
అసలు టోర్నీలో ఈ టీమ్‌ను చేర్చడం పొరపాటని, అందుకే ఆ క్లబ్‌ను తీసివేసినట్లు నిర్వాహకులు చెప్పారు. తొలి మ్యాచ్ ఆడిన తర్వాత ఆ టీమ్‌ను టోర్నీ నుంచి తీసివేశాం. ఆ తర్వాత టీమ్, అందులోని ప్లేయర్స్‌పై పూర్తిగా నిషేధం విధించాం అని నిర్వాహక కమిటీ సభ్యుడు వెల్లడించారు. ఆన్లైన్ స్కోరింగ్ సిస్టమ్ కారణంగా తాము ఆ టీమ్ పేరును గుర్తించడంలో విఫలమయ్యామని ఆ సభ్యుడు తెలిపారు.