గురువారం 02 జూలై 2020
Sports - Apr 28, 2020 , 20:30:52

భారీ శతకాలు బాదాలనుకుంటున్నా: డికాక్

భారీ శతకాలు బాదాలనుకుంటున్నా: డికాక్

కేప్​టౌన్​: ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ కోసం తమ జట్టు సిద్ధంగా ఉందని దక్షిణాఫ్రికా టీ20, వన్డే జట్టు కెప్టెన్ క్వింటన్ డికాక్ చెప్పాడు. డుప్లెసిస్​ నుంచి పరిమిత ఓవర్ల పగ్గాలు అందుకున్నాక.. డికాక్ సారథ్యంలోని సఫారీ జట్టు వన్డే సిరీస్​లో ఆస్ట్రేలియాను 3-0తో చిత్తుచేయగా… ఇంగ్లండ్​ను టీ20 సిరీస్​లో ఓడించింది. వన్డే సిరీస్​లో ఆసీస్​ను క్లీన్​స్వీప్ చేయడం హైలెట్ అని డికాక్ చెప్పాడు. జట్టు కోసం మరింత మెరుగై… భారీ శతకాలను సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు మంగళవారం ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. కెప్టెన్సీ గురించి క్రమక్రమంగా నేర్చుకుంటున్నానని డికాక్ అన్నాడు.

“నేను బాగానే ఆడా. కానీ కొన్నిసార్లు మంచి ప్రారంభాలే లభించినా భారీ స్కోర్లు చేయలేకపోయా. ముఖ్యంగా ఇంగ్లండ్​లో జరిగిన టెస్టు సిరీస్​లో ఇలా అయింది. ఇంకా మెరుగై.. జట్టు కోసం భారీ శతకాలు సాధించాలని అనుకుంటున్నా. ప్రస్తుతం ఇది చాలా అవసరం” అని డికాక్ చెప్పాడు. కాగా ఆగస్టులో దక్షిణాఫ్రికా.. వెస్టిండీస్​లో పర్యటించాల్సి ఉన్నా కరోనా వైరస్ కారణంగా టూర్​ సందిగ్ధంలో పడింది. దీనిపైనా డికాక్ స్పందించాడు. కొంతకాలం వేచిచూడాలని, వైరస్ ప్రభావం తగ్గితే మళ్లీ క్రికెట్ ప్రారంభమవుతుందని చెప్పాడు. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందో కచ్చితంగా చెప్పలేమని క్వింటన్ డికాక్ అన్నాడు. 


logo