మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 07, 2020 , 00:35:17

సెమీస్‌లోబెంగళూరు

 సెమీస్‌లోబెంగళూరు

హైదరాబాద్‌: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌   (పీబీఎల్‌) ఐదో సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగళూరు రాప్టర్స్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం ఇక్కడి గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన లీగ్‌ దశ చివరి టైలో బెంగళూరు 5-0 తేడాతో అవధె వారియర్స్‌పై విజయం సాధించింది. తొలుత పురుషుల డబుల్స్‌లో ఓటమి ఎదురైనా రాప్టర్‌ ఆ తర్వాత పుంజుకుంది. ప్రత్యర్థి ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంపిక చేసుకున్న పురుషుల సింగిల్స్‌లో బెంగళూరు ఆటగాడు బ్రైస్‌ లావెర్డెజ్‌ గెలిచాడు. ఆ తర్వాత జరిగిన మహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌, రాప్టర్స్‌ స్టార్‌ తైజూ యింగ్‌ 15-12, 15-12తో 14వ ర్యాంకర్‌ బివాన్‌ జెంగ్‌పై గెలువడంతో బెంగళూరు సెమీఫైనల్‌ చేరింది. పురుషుల సింగిల్స్‌ ట్రంప్‌ మ్యాచ్‌లో సాయిప్రణీత్‌ గెలువడంతో పాటు మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ విజయం లభించడంతో బెంగళూరు 5-0తేడాతో వారియర్స్‌పై విజయ ఢంకా మోగించింది. 


సెమీఫైనల్స్‌

నార్త్‌ఈస్టర్న్‌ X చెన్నై (శుక్రవారం)

బెంగళూరు X పుణె  (శనివారం)

logo
>>>>>>