గురువారం 09 జూలై 2020
Sports - Apr 22, 2020 , 00:14:34

స్నేహిత్‌ @ 40

స్నేహిత్‌ @ 40

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట  ప్రతినిధి: తెలంగాణ యువ టేబుల్‌ టెన్నిస్‌ ఆటగాడు ఎస్‌ఎఫ్‌ఆర్‌ స్నేహిత్‌ తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకున్నాడు. ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య(ఐటీటీఎఫ్‌) తాజాగా విడుదల చేసిన అండర్‌-21 ర్యాంకింగ్స్‌లో స్నేహిత్‌ 40వ ర్యాంక్‌లో నిలిచాడు. గత జనవరిలో 117వ ర్యాంక్‌లో ఉన్న ఈ టీటీ స్టార్‌..ఇటీవల ఒమన్‌ ఓపెన్‌లో అద్భుత ప్రదర్శన కనబరచడం ద్వారా మెరుగైన ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. హోరాహోరీగా సాగిన సెమీస్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ మానవ్‌ థక్కర్‌ చేతిలో స్నేహిత్‌ పోరాడి ఓడాడు.


logo