మంగళవారం 31 మార్చి 2020
Sports - Mar 18, 2020 , 01:18:37

షెడ్యూల్‌ ప్రకారమే ప్రపంచకప్‌- ఐసీసీ

 షెడ్యూల్‌ ప్రకారమే ప్రపంచకప్‌- ఐసీసీ

దుబాయ్‌: కరోనా వైరస్‌(కొవిడ్‌-19) కారణంగా..అక్టోబర్‌లో ప్రారంభం కావాల్సిన పురుషుల టీ20 ప్రపంచకప్‌పైనా అనుమానాలు తలెత్తడంతో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) స్పందించింది. ఆస్ట్రేలియాలో జరగాల్సిన విశ్వటోర్నీని షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తామని మంగళవారం వెల్లడించింది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు సైతం కొనసాగిస్తున్నామని ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు ఆస్ట్రేలియాలోని ఏడు మైదానాల్లో టీ20 ప్రపంచకప్‌ జరగాల్సి ఉంది. ‘సంబంధిత శాఖలను టీ20 ప్రపంచకప్‌ నిర్వాహక కమిటీ నిత్యం సంప్రదిస్తున్నది. ప్రస్తుతం కరో నా వైరస్‌ పరిస్థితులపై సమీక్షిస్తున్నది. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. టోర్నీ షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతుంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కొనసాగిస్తాం’ అని ఐసీసీ వెల్లడించింది. 


సాధారణ పరిస్థితి నెలకొంటుంది..! 

ప్రపంచకప్‌ ప్రారంభం కావాల్సిన అక్టోబర్‌కు చాలా సమముందని, అప్పటిలోగా కరోనా ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) చీఫ్‌ కెవిన్‌ రాబర్ట్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ప్రస్తుత పరిస్థితిని గతంలో ఎవరూ ఊహించలేదు. అక్టోబర్‌-నవంబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ సాధారణ పరిస్థితుల మధ్య జరుగుతుందని ఆశిస్తున్నాం’ అని రాబర్ట్‌ అన్నాడు. కాగా కరోనా కారణంగా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో అన్ని క్రికెట్‌ కార్యకలాపాలు రద్దయిన సంగతి తెలిసిందే.


logo
>>>>>>