మంగళవారం 26 మే 2020
Sports - May 22, 2020 , 23:59:37

ఐపీఎల్‌ ఆడకుండా అడ్డుకోవాలి: బోర్డర్‌

ఐపీఎల్‌ ఆడకుండా అడ్డుకోవాలి: బోర్డర్‌

మెల్‌బోర్న్‌: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడితే ఆ సమయంలో ఐపీఎల్‌-13వ సీజన్‌ నిర్వహించాలనుకుంటున్న తరుణంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ అలెన్‌ బోర్డర్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. పొట్టి ప్రపంచకప్‌ను కాదని ఐపీఎల్‌ నిర్వహిస్తే.. ఆయా దేశాలు తమ ఆటగాళ్లను అందులో పాల్గొనకుండా అడ్డుకోవాలని అన్నాడు. ‘ఈ నిర్ణయంతో నేను సంతోషంగా లేను. ఒక దేశ లీగ్‌ కన్నా ప్రపంచ స్థాయి టోర్నీకి విలువ ఎక్కువ. వరల్డ్‌ కప్‌ జరుగనప్పుడు ఐపీఎల్‌ కూడా నిర్వహించకూడదు. అది కేవలం డబ్బు కోసమే అని స్పష్టమవుతున్నది. టీ20 ప్రపంచకప్‌ రైద్దెతే.. బోర్డులన్నీ తమ ఆటగాళ్లు ఐపీఎల్లో పాల్గొనకుండా అడ్డుకోవాలి’ అని అలెన్‌ పిలుపునిచ్చాడు.


logo