సోమవారం 25 మే 2020
Sports - Mar 31, 2020 , 19:26:12

షెడ్యూల్ ప్ర‌కార‌మే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌

షెడ్యూల్ ప్ర‌కార‌మే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌

షెడ్యూల్ ప్ర‌కార‌మే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో షెడ్యూల్ ప్ర‌కార‌మే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌రుగుతుంద‌ని మెగాటోర్నీ నిర్వాహ‌కులు స్ప‌ష్టం చేశారు. విశ్వ‌మారి క‌రోనా వైర‌స్ కార‌ణంగా అస‌లు నిర్వ‌హ‌ణ సాధ్య‌మా లేదా అన్న‌దానికి దీంతో ఫుల్‌స్టాప్ ప‌డింది. ఈ నెల 27న జ‌రిగిన ఐసీసీ బోర్డు టెలి కాన్ఫ‌రెన్స్‌లో  వైర‌స్ వ్యాప్తిపై చ‌ర్చ జ‌రిగింది. అయితే టీ20 ప్ర‌పంచ క‌ప్‌ను వాయిదా వేయాలంటూ స‌భ్య‌దేశాల నుంచి ఎలాంటి డిమాండ్ రాలేద‌ని టోర్నీ వ‌ర్గాలు తెలిపాయి. ‘కొవిడ్‌-19 వైర‌స్ ప్ర‌భావాన్ని మేము ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నాం. ప‌రిస్థితుల‌ను బట్టి నిర్ణ‌యం తీసుకుంటాం. మా జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌ను మేము కొన‌సాగిస్తాం’ అని ఐసీసీ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఆస్ట్రేలియాలో ఏడు వేదిక‌లుగా అక్టోబ‌ర్ 18 నుంచి నవంబ‌ర్ 15 వ‌ర‌కు పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ జ‌రుగ‌నుంది.
logo