T20 World Cup Biggest Six | టీ20 క్రికెట్ అంటేనే బౌండరీల వర్షం. ప్రతి బ్యాట్స్‌మెన్ కూడా బంతిని బౌండరీ దాటించడానికే ప్రయత్నిస్తుంటాడు. అయితే కొందరే ఈ బౌండరీల్లో కూడా రికార్డులు సృష్టిస్తారు. క్రికెట్లో పెద్దగా పరిచయమే లేని క్రీడాకారులు ఇలాంటి రికార్డులు సృష్టించడం మాత్రం అరుదు.
టీ20 ప్రపంచకప్ తొలి రౌండ్ గ్రూప్ బీ మ్యాచ్‌లో ఇలాంటి ఉదంతమే చోటుచేసుకుంది. పపవా న్యూగినియా, స్కాట్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఆటగాడు రిచీ బెర్రింగ్టన్ భారీ సిక్సర్ బాదాడు. పపువా న్యూగినియా పార్ట్‌టైం బౌలర్ లెగా సియాకా వేసిన బంతిని 97 మీటర్ల భారీ సిక్సర్‌గా మలిచాడు.
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ నమోదైన సిక్సర్లలో భారీ సిక్స్ ఇదే కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో బెర్రింగ్టన్ కేవలం 49 బంతుల్లోనే 70 పరుగులు చేశాడు.