బుధవారం 03 మార్చి 2021
Sports - Feb 02, 2021 , 12:24:40

భార‌త పారా అథ్లెటిక్స్ జ‌ట్టు మేనేజ‌ర్‌గా సంజీవ‌య్య‌

భార‌త పారా అథ్లెటిక్స్ జ‌ట్టు మేనేజ‌ర్‌గా సంజీవ‌య్య‌

హైద‌రాబాద్‌:  న‌గ‌రానికి చెందిన పారా బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ టీ.సంజీవ‌య్య‌కు అరుదైన అవ‌కాశం ద‌క్కింది.  దుబాయ్‌లో జ‌ర‌గ‌నున్న ఫ‌జా పారాలింపిక్‌ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రికి .. ఇండియ‌న్ టీమ్ మేనేజ‌ర్‌గా ఎంపిక‌య్యారు. రైల్ నిల‌యంలో ఉద్యోగం చేస్తున్న పారా బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ సంజీవ‌య్‌.. గ‌తంలో భార‌త దేశం త‌ర‌పున అనేక పారా టోర్నీల్లో ప్రాతినిధ్యం వ‌హించారు. అయితే భార‌తీయ పారాలింపిక్‌ క‌మిటీ ఇప్పుడు ఆయ‌న‌కు జ‌ట్టు మేనేజ‌ర్‌గా మ‌రో బాధ్య‌త‌ను అప్ప‌గించింది.  వ‌ర‌ల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో భాగంగా దుబాయ్‌లో తొలి సీజ‌న్‌ను నిర్వ‌హించ‌నున్నారు.  ఆ దివ్యాంగ క్రీడ‌ల‌కు సంజీవ‌య్య‌.. ఇండియ‌న్ టీమ్ మేనేజ‌ర్‌గా ఎంపిక కావ‌డం విశేషం.  ఫజా పారాలింపిక్‌ అథ్లెటిక్స్ పోటీలు దుబాయ్‌లో ఈనెల 5వ తేదీ నుంచి 14వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి.  50 మంది పురుషులు, మ‌హిళ‌ల దివ్యాంగ క్రీడాకారుల‌తో కూడిన భార‌త జ‌ట్టుకు సంజీవ‌య్య మేనేజ‌ర్‌గా నేతృత్వం వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. 


రైల్వేలో ఆప‌రేష‌న్ విభాగంలో ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న సంజీవ‌య్య‌.. ప‌లు జాతీయ‌, అంత‌ర్జాతీయ పారా టోర్నీల్లో క్రీడాకారుడిగా, మేనేజ‌ర్‌గా రాణించారు. పారా బ్యాడ్మింట‌న్ క్రీడాకారుడిగా సింగ‌పూర్‌, ఫ్రాన్స్‌,  ఇజ్రాయెల్‌, స్విట్జ‌ర్లాండ్‌, జ‌ర్మ‌నీ, శ్రీలంక‌, థాయిలాండ్‌, ఇంగ్లండ్ టోర్నీలో పాల్గొని దేశానికి అనేక ప‌త‌కాలు కూడా సాధించారు. ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్ర‌ పారా  క్రీడా సంఘం కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతూ.. క్రీడాభివృద్ధి కోసం అనేక అంత‌ర్జాతీయ పోటీల‌కు హాజ‌రు అవుతున్నారు. 

VIDEOS

logo