టీమ్ఇండియా యార్కర్ స్పెషలిస్ట్, ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ టీ నటరాజన్(30)
గత నెలలో మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నటరాజన్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. టోర్నీ వాయిదా వేయడానికి ముందే మోకాలి గాయం కారణంగా
ఐపీఎల్ 14వ సీజన్ నుంచి వైదొలిగాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్‌కు గాయం తిరగబెట్టడంతో లీగ్ నుంచి తప్పుకున్నాడు.
లెఫ్టార్మ్ సీమర్ నటరాజన్ తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోను ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. నట్టూ ప్రస్తుతం తన ఇంట్లోనే పునరావాసంలో ఉన్నాడు. నేను రోజురోజుకీ ధృఢంగా తయారవుతున్నానంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా రీహాబ్, ప్రొగ్రెస్ అనే రెండు హ్యాష్‌ట్యాగ్‌లను జోడించాడు.