మంగళవారం 19 జనవరి 2021
Sports - Dec 13, 2020 , 20:45:25

ఏడాది తర్వాత భారత్‌లో మళ్లీ దేశవాళీ క్రికెట్‌

ఏడాది తర్వాత భారత్‌లో మళ్లీ  దేశవాళీ క్రికెట్‌

న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్‌ను పునఃప్రారంభించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.  దేశంలో కరోనా మహమ్మారి వల్ల నిలిచిపోయిన  క్రికెట్ కార్యకలాపాలు మళ్లీ ప్రారంభంకానున్నాయి.  క్రికెటర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేశవాళీ సీజన్ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌ జనవరి 10 నుంచి మొదలవనుంది. అన్ని జట్లు కూడా జనవరి 2న తమ బయో బబుల్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌ జనవరి 31న జరగనుంది.   

దేశవాళీ సీజన్‌ను ఎలా నిర్వహించాలనే విషయంలో మీ అభిప్రాయం చెప్పాలని ఇప్పటికే రాష్ట్రా క్రికెట్‌ సంఘాలను బీసీసీఐ కోరింది. తాజాగా వారి నుంచి వచ్చిన సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ టోర్నీ షెడ్యూల్‌ విడుదల చేసింది.  దాదాపు ఏడాది తర్వాత భారత్‌లో క్రికెట్‌ మ్యాచ్‌లు జరగబోతున్నాయి.