గురువారం 21 జనవరి 2021
Sports - Dec 29, 2020 , 17:16:03

సిడ్నీలోనే ఇండియా, ఆస్ట్రేలియా మూడో టెస్ట్‌

సిడ్నీలోనే ఇండియా, ఆస్ట్రేలియా మూడో టెస్ట్‌

సిడ్నీ: ఇండియా, ఆస్ట్రేలియా మ‌ధ్య జరిగే మూడో టెస్ట్‌ను సిడ్నీలోనూ నిర్వ‌హించాల‌ని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణ‌యించింది. న‌గ‌రంలో క‌రోనా వ్యాప్తి త‌గ్గిన నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది. క్రిస్మ‌స్‌కు ముందు సిడ్నీలో స‌డెన్‌గా క‌రోనా కేసులు పెర‌గ‌డంతో మ్యాచ్‌ను నిర్వ‌హించాలా వ‌ద్దా అన్న సందిగ్ధంలో ప‌డింది క్రికెట్ ఆస్ట్రేలియా. స్టాండ్‌బైగా మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని సిద్ధంగా ఉంచింది. న్యూసౌత్ వేల్స్‌, క్వీన్స్‌ల్యాండ్ ప్ర‌భుత్వాల‌తో క‌లిసి చ‌ర్చించిన త‌ర్వాత మ్యాచ్‌ను సిడ్నీలోనే నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈవో నిక్ హాక్‌లీ తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కూ స‌మ్మ‌ర్ సీజ‌న్ అంతా ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగిపోయింద‌ని, మూడో టెస్ట్ సిడ్నీలో, నాలుగో టెస్ట్ బ్రిస్బేన్‌లో కూడా ఇలాగే జ‌రుగుతాయ‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. ప్ర‌తి ఏటా సిడ్నీలో జ‌రిగే న్యూ ఇయ‌ర్ టెస్ట్‌కు పింక్ టెస్ట్‌గా పేరుంది. ఈ మ్యాచ్ ద్వారా వ‌చ్చే డ‌బ్బు.. మెక్‌గ్రాత్ ఫౌండేష‌న్‌కు ఇస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్స‌ర్ బాధితుల‌కు ఈ ఫౌండేష‌న్ సాయం చేస్తుంది. 


logo