గురువారం 25 ఫిబ్రవరి 2021
Sports - Feb 06, 2021 , 20:41:22

బీబీఎల్‌-2021 టైటిల్‌ విజేత సిడ్నీ సిక్సర్స్

బీబీఎల్‌-2021 టైటిల్‌ విజేత సిడ్నీ సిక్సర్స్

సిడ్నీ: ఆస్ట్రేలియా వేదికగా జరిగే బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)-2021 సీజన్‌లో  డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్‌  మళ్లీ టైటిల్‌ను నిలబెట్టుకుంది. వరుసగా రెండోసారి బీబీఎల్‌ టైటిల్‌ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన లీగ్‌ తుది పోరులో పెర్చ్‌ స్కార్చర్స్‌ను 27 పరుగులతో ఓడించింది. సిడ్నీ జట్టుకు ఇది మూడో బీబీఎల్‌ టైటిల్‌ కావడం విశేషం.  తొలుత బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ  జట్టులో ఓపెనర్‌ జేమ్స్‌ విన్స్‌(95) వీరవిహారం చేయడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో పెర్త్‌ టీమ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులకే పరిమితమైంది. లియామ్‌ లివింగ్‌స్టోన్‌ 45 టాప్‌ స్కోరర్‌.   

VIDEOS

logo