బుధవారం 20 జనవరి 2021
Sports - Jan 04, 2021 , 16:29:25

మూడో టెస్టుకు 25 శాతం మంది ప్రేక్షకులకు అనుమతి

మూడో టెస్టుకు 25 శాతం మంది ప్రేక్షకులకు అనుమతి

సిడ్నీ: భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే మూడో టెస్టుకు  సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌  ఆతిథ్యమివ్వనుంది.  కొవిడ్‌-19 ముప్పుకారణంగా ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియం సామర్థ్యంలో 25శాతం వరకు మాత్రమే  ప్రేక్షకులను అనుమతించాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా నిర్ణయించింది. స్టేడియాల్లో ప్రేక్షకుల అనుమతి 50 శాతం వరకు ఉండగా  సిడ్నీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో న్యూ సౌత్‌వేల్స్‌ ప్రభుత్వం సూచనల మేరకు  25శాతానికి అంటే  మరో 10వేల మంది ప్రేక్షకులను తగ్గించారు.

గతేడాది నవంబర్‌-డిసెంబర్‌లో సిడ్నీ వేదికగా ఇరుజట్ల మధ్య రెండు వన్డేలు, టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఆ సమయంలో 18వేల మందిని స్టేడియంలోకి అనుమతించారు.   ఇరుజట్ల మధ్య మూడో టెస్టు జనవరి ఏడు నుంచి ఆరంభంకానుంది.


logo