గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Aug 08, 2020 , 02:30:47

యూఎస్‌ ఓపెన్‌కు స్విత్లోనా, బెర్టెన్స్‌ దూరం

యూఎస్‌ ఓపెన్‌కు  స్విత్లోనా, బెర్టెన్స్‌ దూరం

న్యూయార్క్‌: ప్రతిష్టాత్మక యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ నుంచి ప్లేయర్ల నిష్క్రమణ పర్వం కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే ప్రపంచ నంబర్‌వన్‌ ఆశ్లే బార్టీ దూరం కాగా, తాజాగా ఎలీనా స్విత్లోనా, కికి బెర్టెన్స్‌ ఈ జాబితాలో చేరారు. అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు వారు పేర్కొన్నారు. ‘టోర్నీ కోసం నిర్వాహకులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుండటాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ అమెరికాకు వెళ్లి నాతో పాటు నా సహాయక సిబ్బందిని ప్రమాదంలోకి నెట్ట దల్చుకోలేను’ అని స్విత్లోనా ట్వీట్‌ చేసింది. మరోవైపు బ్రిటన్‌ టెన్నిస్‌ స్టార్‌ అండీ ముర్రేకు యూఎస్‌ ఓపెన్‌లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ లభించింది. జనవరి 2019 తర్వాత ముర్రే బరిలోకి దిగబోతున్న తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఇది. 


logo