శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Oct 09, 2020 , 01:15:31

స్విటెక్‌ సంచలనం

స్విటెక్‌ సంచలనం

  • ఫైనల్లో పొలాండ్‌ టీనేజర్‌ 
  • కెనిన్‌తో తుదిపోరు 
  •  ఫ్రెంచ్‌ ఓపెన్‌

పొలాండ్‌ 19ఏండ్ల సంచలనం ఇగా స్విటెక్‌ అద్భుత ఆటతీరును  కొనసాగిస్తూ ఫ్రెంచ్‌ ఓపెన్‌కు తుదిపోరుకు దూసుకెళ్లింది. సెమీస్‌లో పొదొరొస్కాపై వరుస సెట్లలో గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కోసం 4వ సీడ్‌ సొఫియా కెనిన్‌తో తలపడనుంది. మరోవైపు రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ వేటలో ఉన్న కెనిన్‌ సెమీస్‌లో ఏడో సీడ్‌ క్విటోవాపై విజయం సాధించింది. పొలాండ్‌ 19ఏండ్ల సంచలనం ఇగా స్విటెక్‌ అద్భుత ఆటతీరును  కొనసాగిస్తూ ఫ్రెంచ్‌ ఓపెన్‌కు తుదిపోరుకు దూసుకెళ్లింది. సెమీస్‌లో పొదొరొస్కాపై వరుస సెట్లలో గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కోసం 4వ సీడ్‌ సొఫియా కెనిన్‌తో తలపడనుంది. మరోవైపు రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ వేటలో ఉన్న కెనిన్‌ సెమీస్‌లో ఏడో సీడ్‌ క్విటోవాపై విజయం సాధించింది. 

పారిస్‌: తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ సెమీఫైనలిస్టుల మధ్య జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ పోరులో పొలాండ్‌ టీనేజర్‌ ఇగా స్విటెక్‌ ఘన విజయం సాధించింది. మొదటిసారి మెగాటోర్నీ ఫైనల్‌కి చేరి టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది. గురువారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్‌లో 54వ ర్యాంకర్‌ స్విటెక్‌ 6-2, 6-1 తేడాతో నాడియా పొదొరొస్కా(అర్జెంటీనా)పై వరుస సెట్లలో సునాయాసంగా గెలిచింది. 1939లో జాడ్విగా తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌ చేరిన తొలి పొలాండ్‌ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. 70 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో 19 ఏండ్ల  స్విటెక్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రిక్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌ సిమోనా హలెప్‌ను ఓడించిన పొదొరొస్కాను అలవోకగా చిత్తుచేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసిన ఇగా.. 23 విన్నర్లతో అదరగొట్టింది. మరోవైపు పొదొరొస్కా ఆరు విన్నర్లకే పరిమితమైంది. మ్యాచ్‌లో ఏ దశలోనూ వెనుకబడని స్విటెక్‌ ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా తుదిపోరుకు చేరింది. ఇక మరో సెమీస్‌ పోరులో నాలుగో సీడ్‌ అమెరికా ప్లేయర్‌ సోఫియా కెనిన్‌ 6-4, 7-5 తేడాతో ఏడో పెట్రా క్విటోవా(చెక్‌ రిపబ్లిక్‌)పై గంటా 45 నిమిషాల్లోనే గెలిచింది. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌ విజేత అయిన కెనిన్‌ తన రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కోసం స్విటెక్‌తో శనివారం తాడోపేడో తేల్చుకోనుంది.  

జొకో పదోసారి

సెర్బియా వీరుడు, టాప్‌ సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ 10వ సారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీఫైనల్‌లో అడుగుపెట్టాడు. క్వార్టర్‌ ఫైనల్‌లో ఎడమచేయి ఇబ్బంది పెట్టినా అద్భుతంగా ఆడిన జొకో 4-6, 6-2, 6-3, 6-4 తేడాతో 17వ సీడ్‌ పాబ్లో కరెనో బుస్టా(స్పెయిన్‌)పై క్వార్టర్స్‌లో విజయం సాధించాడు.