టోక్యో :నాలుగుసార్లు స్వర్ణ పతక విజేత, ప్రపంచ నంబర్‌వన్ జట్టుగా ఉన్న అమెరికా మహిళల ఫుట్‌బాల్ టీమ్‌కు స్వీడన్ షాక్ ఇచ్చింది. టోక్యో ఒలింపిక్స్ లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో అమెరికాను 3-0 తేడాతో ఓడించింది. స్వీడిష్ ఫార్వర్డ్ ైస్టెనా బ్లాక్స్టెనీయస్, మిడ్ ఫీల్డర్లు రోస్ లవెల్లె, జూలీ ఎర్ట్ చెరో గోల్ కొట్టారు. దీంతో 2019 నుంచి ఓటమి లేకుండా ఆడుతున్న యూఎస్ఎ జట్టుకు ఒలింపిక్స్ తొలి మ్యాచ్‌లోనే షాక్ తగిలింది.