శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Sep 07, 2020 , 01:57:23

బంతిపై శానిటైజర్‌..క్లేడన్‌పై వేటు

 బంతిపై శానిటైజర్‌..క్లేడన్‌పై వేటు

లండన్‌: ఆస్ట్రేలియాకు చెందిన ఇంగ్లిష్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ మిచ్‌ క్లేడన్‌ మూల్యం చెల్లించుకున్నాడు. కరోనా వైరస్‌ నిబంధనలకు విరుద్ధంగా బంతిపై శానిటైజర్‌ పూసి సస్పెన్షన్‌ కొని తెచ్చుకున్నాడు. కౌంటీల్లో భాగంగా గత నెలలో మిడిలెసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ససెక్స్‌ తరఫున బరిలోకి దిగిన క్లేడన్‌ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో బంతిపై శానిటైజర్‌ పూయడం ఈ 37 ఏండ్ల పేసర్‌ కొంపముంచింది.  


logo