మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Oct 02, 2020 , 16:09:24

బంతికి శానిటైజర్ రాసిన బౌలర్.. 9 మ్యాచ్‌ల నిషేధం

బంతికి శానిటైజర్ రాసిన బౌలర్.. 9 మ్యాచ్‌ల నిషేధం

లండన్:  కరోనా నేపథ్యంలో  క్రికెట్‌ మ్యాచ్‌లో  బంతికి ఉమ్మి, శానిటైజర్ పూయడాన్ని ఐసీసీ నిషేధించిన విషయం తెలిసిందే. నిబంధనలను అతిక్రమించి బంతికి శానిటైజర్‌ పూసి బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడిన ససెక్స్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మిచ్‌ క్లేడాన్‌పై ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు 9 మ్యాచ్‌ల నిషేధం విధించింది.  ఆగస్టులో మిడిల్‌సెక్సతో  జరిగిన మ్యాచ్‌లో  క్లేడాన్‌  శానిటైజర్‌ను బంతికి రాశాడని ససెక్స్‌ ఒక ప్రకటనలో  తెలిపింది.   ఆ తొమ్మిది మ్యాచ్‌లలో టీ20 బ్లాస్ట్‌ క్వార్టర్‌ ఫైనల్‌ కూడా ఉంది.

2021 సీజన్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లను కూడా అతడు దూరంకానున్నాడు.   ఆస్ట్రేలియాలో జన్మించిన  37 ఏండ్ల  క్లేడాన్‌   ఈసీబీ నిబంధనలు 3.3, 3.7లను ఉల్లంఘించాడు. బాబ్ విల్లీస్ ట్రోఫీలో భాగంగా  ఆగస్టు 23న మిడిల్‌సెక్స్‌తో మ్యాచ్‌లో  బంతికి హ్యాండ్‌ శానిటైజర్‌ రాశాడని   ఈసీబీ  ఆరోపణల నేపథ్యంలో  గత నెలలోనే క్లేడాన్‌ను ససెక్స్‌ సస్పెండ్‌ చేసింది.  అతడిపై 6 మ్యాచ్‌ల   సస్పెన్షన్ విధించింది.   మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో క్లేడాన్ ఈ చర్యకు  పాల్పడినట్లు ఈసీబీ గుర్తించింది.   ఆ మ్యాచ్‌లో అత‌డు మూడు వికెట్లు పడగొట్టాడు.     క్లేడాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న  మూడో కౌంటీ జట్టు  ససెక్స్‌.