మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Sep 16, 2020 , 00:08:44

స్టోక్స్‌ అందుబాటులో ఉండేది అనుమానమే: మెక్‌డొనాల్డ్‌

స్టోక్స్‌ అందుబాటులో ఉండేది అనుమానమే: మెక్‌డొనాల్డ్‌

దుబాయ్‌: ఐపీఎల్‌ టోర్నీకి స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అందుబాటులో ఉండేది అనుమానమేనని రాజస్థాన్‌ రాయల్స్‌ చీఫ్‌ కోచ్‌ మెక్‌డొనాల్డ్‌ అన్నాడు. బ్రెయిన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న తండ్రి జెడ్‌ బాగోగులను దగ్గరుండి చూసుకుంటున్న కారణంగా స్టోక్స్‌ లీగ్‌లో ఆడేది సందేహంగా మారింది.  ఈ నేపథ్యంలో కోచ్‌ మెక్‌డొనాల్డ్‌ మంగళవారం మీడియాతో పలు అంశాలపై మాట్లాడుతూ ‘క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న స్టోక్స్‌ కుటుంబానికి అండగా ఉంటాం. సమస్యను దృష్టిలో పెట్టుకుని అతనికి తగినంత సమయం ఇవ్వాలనుకుంటున్నాం. ఎప్పుడు వీలైతే అప్పుడు జట్టుతో కలిసేందుకు అతడికి అవకాశముంది. ప్రస్తుతానికైతే స్టోక్స్‌ ప్రాతినిధ్యంపై ఇప్పుడే ఏం చెప్పలేము’ అని అన్నాడు. 


logo