గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 04, 2020 , 14:57:58

పాకిస్థాన్‌ను వణికిస్తోన్న భారత బౌలర్లు

పాకిస్థాన్‌ను వణికిస్తోన్న భారత బౌలర్లు

17 ఓవర్లు ముగిసేసరికి పాక్‌ 2 వికెట్లకు 60 పరుగులు చేసింది.

పోచెఫ్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా):  అండర్‌-19 వరల్డ్‌కప్‌ తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ జోరు కోనసాగుతోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను భారత బౌలర్లు వణికిస్తున్నారు. ఆరంభం నుంచి ధాటిగా బంతులేస్తూ ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నారు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే సుశాంత్‌ మిశ్రా పాక్‌కు షాకిచ్చాడు. ఓపెనర్‌ బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ హురైరాను ఔట్‌ చేసి భారత్‌ శిబిరంలో ఉత్సాహం నింపాడు. దీంతో జట్టు స్కోరు 9కే పాక్‌ తొలి వికెట్‌ కోల్పోయింది.

అనంతరం 34 పరుగుల వద్ద రెండో వికెట్‌ చేజార్చుకుంది. బౌలింగ్‌ సంచలనం రవి బిష్ణోయ్‌  వన్‌డౌన్‌లో వచ్చిన ఫహాద్‌ మునీర్‌(4)ను పెవిలియన్‌ పంపాడు. 9 ఓవర్లలోపే 34 పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో పాక్‌పై ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం క్రీజులో ఉన్న ఓపెనర్‌ హైదర్‌ అలీ(31), కెప్టెన్‌ నజీర్‌(18) మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. కుదురుకుంటున్న ఈ జోడీని విడదీసేందుకు యువ భారత్‌ శ్రమిస్తోంది.17 ఓవర్లు ముగిసేసరికి  పాక్‌ 2 వికెట్లకు 60 పరుగులు చేసింది. logo
>>>>>>