గురువారం 03 డిసెంబర్ 2020
Sports - Oct 28, 2020 , 01:28:44

సూర్య కుమార్‌ ఇంకేం చేయాలో: భజ్జీ

 సూర్య కుమార్‌ ఇంకేం చేయాలో: భజ్జీ

ముంబై: ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత జట్లలో ముంబై బ్యాట్స్‌మన్‌ సూర్య కుమార్‌ యాదవ్‌కు చోటు దక్కకపోవడంపై స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఎన్నో ఏండ్లుగా దేశవాళీ టోర్నీలతో పాటు ఐపీఎల్‌లో రాణిస్తున్నా టీమ్‌ఇండియాలో అతడికి చోటు దక్కడం లేదని భజ్జీ మంగళవారం ట్వీట్‌ చేశాడు.  ‘టీమ్‌ఇండియాకు ఎంపిక కావాలంటే సూర్య కుమార్‌ ఇంకా ఏం చేయాలో తెలియడం లేదు. ఐపీఎల్‌, రంజీ ట్రోఫీల్లో అతడు రాణిస్తూనే ఉన్నాడు. నాకు తెలిసి బీసీసీఐ నిబంధనలు కొందరికి ఒకలా.. మరికొందరికి మరోలా ఉన్నాయేమో. సూర్య కుమార్‌ రికార్డులు చూడాలని సెలెక్టర్లకు సూచిస్తున్నా’ అని హర్భజన్‌ పేర్కొన్నాడు.  ఈ ఏడాది ఐపీఎల్‌ల్లోనూ ముంబై తరఫున సూర్య  148కి పైగా స్ట్రయిక్‌ రేట్‌తో 283 పరుగులు చేశాడు.