శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Oct 30, 2020 , 01:54:22

సూర్య ఓపికగా ఉండు: రవిశాస్త్రి

 సూర్య ఓపికగా ఉండు: రవిశాస్త్రి

న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ సూర్య కుమార్‌ యాదవ్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతున్న తరుణంలో టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి స్పందించాడు. సూర్య ఓపికగా ఉండాలంటూ ట్వీట్‌ చేశాడు. 43 బంతుల్లో 79 పరుగులు చేసిన యాదవ్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో ముంబైని ఒంటిచేత్తో గెలిపించాడు. దేశవాళీ సహా ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తూ ఉన్నా సూర్య కుమార్‌ను భారత జట్టుకు ఎంపిక చేయకపోవడంపై పలువురు మాజీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత జట్లలో అతడికి చోటు కల్పించాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి గురువారం ట్వీట్‌ చేశాడు. ‘సూర్య నమస్కార్‌. ఇంతే పటిష్టంగా, ఓపికగా ఉండు’ అంటూ యాదవ్‌కు సూచించాడు. మరోవైపు ‘నీలో(సూర్య) దమ్ము ఉంది. త్వరలోనే భారత జట్టుకు ఆడతావు’ అని మాజీ ఓపెనర్‌ సెహ్వాగ్‌ ట్వీట్‌ చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాలంటే సూర్య కుమార్‌ న్యూజిలాండ్‌కు వచ్చేయాలని ఆ దేశ మాజీ ఆల్‌రౌండర్‌ స్కాట్‌ ైస్టెరిస్‌ పరోక్షంగా బీసీసీఐకి చురకలు అంటించాడు.