సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sports - Sep 06, 2020 , 16:05:38

సురేశ్‌రైనా క‌చ్చితంగా మ‌ళ్లీ ఆడ‌తాడు : దీప్‌దాస్‌‌

సురేశ్‌రైనా క‌చ్చితంగా మ‌ళ్లీ ఆడ‌తాడు : దీప్‌దాస్‌‌

వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ 2020 నుంచి వైదొలిగిన సురేశ్‌రైనా తిరిగి క‌చ్చితంగా జ‌ట్టులోకి వ‌చ్చి ఐపీఎల్ ఆడ‌తాడ‌ని భార‌త మాజీ వికెట్ కీప‌ర్ దీప్‌దాస్ గుప్తా అన్నాడు. రైనా, హర్భజన్‌లు ఈ ఏడాది ఐపీఎల్ ఆడ‌టం లేద‌ని ప్ర‌క‌టించిన త‌రువాత దీప్‌దాస్ గుప్తా మాట్లాడుతూ రైనా ఈ ఏడాది మ‌ళ్లీ ఐపీఎల్ ఆడ‌తాడ‌ని, అయితే కొన్ని ప్రారంభ మ్యాచ్‌ల‌కు హాజ‌రు కాడ‌ని, త‌రువాత జ‌ట్టులోకి వ‌స్తాడ‌న్నాడు.  

"సురేశ్‌ రైనా ఈ ఏడాది క‌చ్చితంగా ఐపీఎల్ ఆడతాడు. అయితే క‌రోనా నియమాలు, ప‌రీక్ష‌లు, వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల అత‌డు  మొదటి కొన్ని ఆటలను కోల్పోవచ్చు. కానీ రైనా తిరిగి వస్తాడు అనే భావన నాకు ఉంది.” అని దాస్‌గుప్తా ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్‌ఫోతో అన్నాడు.  "ఎందుకంటే సురేశ్ రైనా స్థానంలో సీఎస్‌కే యాజ‌మాన్యం వేరే ఆట‌గాడితో భ‌ర్తీ చేయ‌క‌పోయినా నేను ఆశ్చ‌ర్య‌పోను" అని అన్నారు. 

సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హ‌ర్భ‌జ‌న్ స్థానాన్ని మాత్రం ఆల్ రౌండర్ జలాజ్ సక్సేనాతో భ‌ర్తీ చేయ‌వ‌చ్చ‌ని దాస్‌గుప్తా అభిప్రాయ ప‌డ్డాడు. "జలాజ్ సక్సేనా ఒక స్థానానికి అర్హుడని నేను భావిస్తున్నాను. అతడు ఆల్ రౌండర్‌గా మెరుగ్గా రాణిస్తున్నాడు. సీఎస్‌కే యాజ‌మాన్యం అత‌డిని ఎంపిక చేయ‌వ‌చ్చని నేను భావిస్తున్నా. అతడు భజ్జీ స్థానంలో చాలా మంచి ఎంపిక"‌ అని దాస్‌గుప్తా తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo