ఆదివారం 24 మే 2020
Sports - Mar 23, 2020 , 17:28:03

సురేశ్‌ రైనా తండ్రయ్యాడు.. ఈసారి 'రియో'

సురేశ్‌ రైనా తండ్రయ్యాడు.. ఈసారి 'రియో'

లక్నో:  టీమ్‌ఇండియా సీనియర్‌ క్రికెటర్‌ సురేశ్‌ రైనా రెండోసారి తండ్రి అయ్యాడు.  సోమవారం సురేశ్‌ రైనా భార్య ప్రియాంక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.  తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని రైనా తెలిపాడు.   రైనా దంపతులకు నాలుగేండ్ల పాప గ్రేసియా రైనా ఉంది. గ్రేసియా తమ్ముడు 'రియో రైనా'ను స్వాగతిస్తున్నందుకు గర్వంగా ఉందని సురేశ్‌ రైనా సోషల్‌ మీడియా ద్వారా చెప్పాడు. ఈ సందర్భంగా తన భార్య, శిశువుతో ఉన్న ఫొటోను రైనా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు.  ఈ సందర్భంగా సహచర క్రికెటర్లు, అభిమానులు రైనాకు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  

2015 ఏప్రిల్‌లో ప్రియాంకను రైనా వివాహం చేసుకున్నాడు. 2016లో గ్రేసియా వారి జీవితంలోకి రాగా రియో రాకతో ఈ జోడీ సంతోషం వ్యక్తం చేసింది.  రైనా చివరిసారిగా 2018 జులైలో ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించాడు. చాలా ఏండ్లుగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంఛైజీ తరఫున ఆడుతున్నాడు.  స్టార్‌ ఆల్‌రౌండర్‌కు గత ఆగస్టులో మోకాలి శస్త్రచికిత్స  జరగ్గా ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. logo