సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Aug 31, 2020 , 18:42:13

ఇక చెన్నై తరఫున సురేశ్‌ రైనా ఆడకపోవచ్చు?

ఇక  చెన్నై తరఫున సురేశ్‌ రైనా  ఆడకపోవచ్చు?

చెన్నై:  చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) సీనియర్‌ ఆటగాడు సురేశ్‌ రైనా రాబోయే ఐపీఎల్‌ సీజన్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. రైనా నిర్ణయంపై చెన్నై ఫ్రాంఛైజీ యజమాని ఎన్‌ శ్రీనివాసన్‌ స్పందించారు.  భవిష్యత్‌లో రైనా మళ్లీ ఫ్రాంఛైజీ తరఫున ఆడే అవకాశం లేదని తెలుస్తున్నది. ఈ విషయంపై శ్రీనివాసన్‌ కూడా నిర్ణయం తీసుకున్నట్లు వినిపిస్తున్నది. 

తనకు కేటాయించిన గదికి బాల్కనీ లేదనే కారణంతోనే రైనా యూఏఈని వదిలి భారత్‌కు తిరిగొచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. రైనా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కసరత్తులు చేస్తున్నది. 2008లో ప్రారంభమైన ఐపీఎల్‌కు రైనా దూరమవడం ఇదే తొలిసారి.  ఐపీఎల్‌-13వ సీజన్‌ సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు జరగనుంది. మూడు వేదికల్లో టోర్నీ నిర్వహిస్తున్నారు. 

తాజావార్తలు


logo