సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Aug 25, 2020 , 15:58:02

సుశాంత్.. మా హృదయాల్లో సజీవంగా ఉంటావ్ : సురేశ్ రైనా

సుశాంత్.. మా హృదయాల్లో సజీవంగా ఉంటావ్ : సురేశ్ రైనా

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) సీనియర్ ప్లేయర్ సురేశ్ రైనా.. ప్రస్తుతం ఐపీఎల్ 2020 కి ముందు దుబాయ్‌లో నిర్బంధ కాలం గడుపుతున్నారు. ఈ సమయంలో సోషల్ మీడియాలో ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేసి దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను గుర్తుచేసుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ కుటుంబానికి న్యాయం చేయాలన్న ప్రచారానికి సురేశ్ రైనా మరోసారి మద్దతు ఇచ్చి.. ప్రభుత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14 న ముంబైలో మరణించారు. ఆయన మృతి కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. సుశాంత్ మరణ వార్త వెలుగులోకి వచ్చినప్పుడు రైనా.. సుశాంత్ ఫొటోను ఎంఎస్ ధోని : ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'సుశాంత్ గురించి విన్నప్పుడు షాక్ కు గురయ్యాను. అతను మాహి బయోపిక్లో పనిచేసినప్పుడు చాలాసార్లు కలువాల్సి వచ్చింది. మేం ఒక అందమైన, ఎప్పుడూ నవ్వుతూ ఉండే నటుడిని కోల్పోయాం. ఇటీవల సుశాంత్ రాజ్‌పుత్‌తో ఫొటోను మరోసారి పంచుకుంటూ.. 'ఇది ఇంకా బాధిస్తుంది. కానీ, నిజం ఖచ్చితంగా బయటకు వస్తుందని నాకు తెలుసు' అని ట్వీట్ చేశారు.

ఇప్పుడు రైనా మరోసారి సుశాంత్ రాజ్‌పుత్ వీడియోను షేర్ చేవారు. ఈ వీడియోలో సుశాంత్ యొక్క ఫొటో కేదార్నాథ్ చిత్రం నేపథ్యంలో ప్లే అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లోని ఈ పోస్ట్‌లలో.. 'సోదరుడు మీరు ఎల్లప్పుడూ మా హృదయాల్లో సజీవంగా ఉంటారు. మీ అభిమానులు మిగతావారి కంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ప్రభుత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు నిజమైన స్ఫూర్తిదాయకం' అని సురేశ్ రైనా రాశారు.logo