మంగళవారం 20 అక్టోబర్ 2020
Sports - Sep 19, 2020 , 01:46:58

జమ్ముకశ్మీర్‌ డీజీపీతో రైనా భేటీ

జమ్ముకశ్మీర్‌ డీజీపీతో రైనా భేటీ

శ్రీనగర్‌: ఐపీఎల్‌ 13వ సీజన్‌ నుంచి తప్పుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా.. శుక్రవారం జమ్ముకశ్మీర్‌ డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌తో సమావేశమయ్యాడు. యువతను క్రీడలవైపు ఆకర్షించి వారిలోని నైపుణ్యాలను వెలికితీసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం.  ‘సురేశ్‌ రైనా జమ్ముకశ్మీర్‌ డీజీపీతో సమావేశమై.. యువతలోని నైపుణ్యాలను వెలికితీసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు’ అని ఓ ఉన్నతాధికారి తెలిపారు. 


logo