శుక్రవారం 29 మే 2020
Sports - Mar 28, 2020 , 17:58:41

పవర్​ప్లేలో గేల్​,ధవన్ కంటే రైనా బెస్ట్ : హాగ్​

పవర్​ప్లేలో గేల్​,ధవన్ కంటే రైనా బెస్ట్ : హాగ్​

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్​(ఐపీఎల్​)లో సురైశ్​ రైనా అద్భుతమైన ఆటగాడని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అన్నాడు. పవర్​ప్లేలో అత్యున్నతంగా ఆడే బ్యాట్స్​మన్​లో రైనా ఒకడని కితాబిచ్చాడు. తన యూట్యూబ్​ చానెల్లో ఐపీఎల్​పై తన అభిప్రాయాలను శనివారం వెల్లడించాడు. ఐపీఎల్​లో డేవిడ్​ వార్నర్​, సురేశ్ రైనా, జాస్ బట్లర్..​ పవర్​ప్లేలో అదరగొట్టే ఆటగాళ్లని హాగ్ అభిప్రాయపడ్డాడు. టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్​ ధావన్, విండీస్ విధ్వంసకారుడు క్రిస్ గేల్​ పేర్లను మాత్రం హాగ్ చెప్పలేదు. ‘చెన్నై సూపర్​ కింగ్స్ తరఫున రైనా ఆడే తీరు నాకు బాగా నచ్చుతుంది. కష్టసమయాల్లో వచ్చి ఇన్నింగ్స్​కు ప్రాణం పోస్తాడు. కొందరు బౌలర్లను టార్గెట్ చేయడంతో పాటు స్ట్రయిక్​ను బాగా రొటేట్ చేస్తాడు’ అని హాగ్ చెప్పాడు. logo