శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Aug 16, 2020 , 02:34:37

ధోనీ దారిలో రైనా

ధోనీ దారిలో రైనా

అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికే విషయంలో సోదర సమానుడైన మహేంద్రసింగ్ ధోనీని సురేశ్ రైనా అనుసరించాడు. క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానంటూ ధోనీ ఇలా సందేశాన్ని పోస్ట్ చేశాడో లేదో.. కొద్ది నిమిషాల వ్య రైనా తాను కూడా నిష్క్రమిస్తున్నట్లు రాసుకొచ్చాడు.  13 ఏండ్ల అంతర్జాతీయ కెరీర్ ఇక ముగింపు అంటూ సంక్షిప్త సందేశాన్ని పెట్టాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్న రైనా...చిరస్మరణీయ విజయాల్లో పాలుపంచుకున్నాడు. 2004 అండర్-19 ప్రపంచకప్ మెరుగైన ప్రదర్శన ద్వారా 19 ఏండ్ల ప్రాయంలో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న ఈ యూపీ క్రికెటర్ అనతి కాలంలోనే గొప్ప క్రికెటర్ ఎదిగాడు. 2005లో శ్రీలంకపై టీమ్ తరఫున అరంగేట్రం చేసిన రైనాకు..ఐదేండ్ల తర్వాత టెస్టు జట్టులో చోటు దొరికింది. లంకతో తొలి టెస్టులోనే సెంచరీతో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన ఈ డ్యాషింగ్ బ్యాట్స్ సారథిగాను ఆకట్టుకున్నాడు. అయితే ఫామ్ జట్టులోకి వస్తూ పోయిన రైనా 2018లో ఇంగ్లండ్ పర్యటనలో భారత్ తరఫున ఆఖరిసారి ఆడాడు.  ఐపీఎల్ ధోనీ, రైనా ఎంతోకాలంగా చెన్నైసూపర్ తరఫునే ఆడుతున్నారు.

రైనా కెరీర్ 

టెస్టులు: మ్యాచ్ 18, పరుగులు: 768, సగటు: 26.48

వన్డేలు: 226, పరుగులు: 5615, సగటు: 35.31 

టీ20లు: 78, పరుగులు: 1605, సగటు: 29.18 


logo