ఆదివారం 24 జనవరి 2021
Sports - Dec 08, 2020 , 21:02:02

శాంసన్‌..సూపర్‌‌మ్యాన్ తరహాలో ఫీల్డింగ్ విన్యాసం

శాంసన్‌..సూపర్‌‌మ్యాన్ తరహాలో ఫీల్డింగ్ విన్యాసం

సిడ్నీ: ఆతిథ్య ఆస్ట్రేలియాతో మూడో టీ20 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా యువ ఆటగాడు సంజూ శాంసన్‌ ఫీల్డింగ్‌ విన్యాసం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో శార్దుల్‌ ఠాకూర్‌ వేసిన 14వ ఓవర్లో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ భారీ షాట్‌ ఆడాడు. సిక్సర్‌ వెళ్లే బంతిని శాంసన్‌  స్టన్నింగ్‌ ఫీల్డింగ్‌తో అడ్డుకోవడంతో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. శాంసన్‌   సిక్స్‌‌ను ఆపిన తీరు ఇప్పుడు ఇంటర్నెట్‌లో  వైరల్ అవుతోంది.  సూపర్‌‌మ్యాన్ తరహాలో గాలిలో ఎగురుతూ బంతిని పట్టి విసిరేసిన తీరుకు  క్రికెట్ ఫ్యాన్స్‌‌  ఫిదా అయ్యారు. 


logo