శనివారం 06 మార్చి 2021
Sports - Jan 18, 2021 , 00:13:56

అంబరంలో విన్యాసాలు అదుర్స్‌

అంబరంలో విన్యాసాలు అదుర్స్‌

  • ముగిసిన పారా మోటార్‌ చాంపియన్‌షిప్‌  
  • ఏరో స్పోర్ట్స్‌ కేంద్రం ఏర్పాటుకు కృషి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ టౌన్‌, జనవరి 17: పాలమూరు వేదికగా తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్వంలో ఐదు రోజుల పాటు అద్భుతంగా సాగిన ఏరో స్పోర్ట్స్‌ జాతీయస్థాయి పారా మోటార్‌ చాంపియన్‌షిప్‌ ముగిసింది. మహబూబ్‌నగర్‌ స్టేడియంలో ఆదివారం చివరి రోజు పోటీలకు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహబూబ్‌ నగర్‌లో ఏరో స్పోర్ట్స్‌ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. వాలీబాల్‌, అథ్లెటిక్స్‌ అకాడమీలు ఏర్పాటు చేసి జిల్లాను స్పోర్ట్స్‌హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. జాతీయ స్థాయి ఏరో స్పోర్ట్స్‌ పాలమూరులో అద్భుతంగా సాగడం గర్వకారణమని అన్నారు. కాగా తెలంగాణ సహా పది రాష్ర్టాల పారా మోటర్‌ పైలట్లు చాంపియన్‌షిప్‌లో విన్యాసాలు ప్రదర్శించారు. చాంపియన్‌షిప్‌లో తెలంగాణ పైలట్‌ ఇమాద్‌ ఫారుఖి రెండో స్థానాన్ని దక్కించుకోగా.. నితిన్‌కుమార్‌ (హర్యానా) విజేతగా నిలిచాడు. మూడో స్థానంలో సత్యనారాయణ (తమిళనాడు) నిలిచాడు. వీరికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ బహుమతులు ప్రదానం చేశారు. థాయ్‌లాండ్‌లో జరిగే చాంపియన్‌షిప్‌లో వీరు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాసరాజు, కలెక్టర్‌ వెంకట్రావు, డీవైఎస్‌వో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo