ఆదివారం 29 మార్చి 2020
Sports - Jan 15, 2020 , 01:18:58

సూపర్‌-7 టోర్నీ విజేత తెలంగాణ

సూపర్‌-7 టోర్నీ విజేత తెలంగాణ

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌: జాతీయస్థాయి ఎస్‌జీఎఫ్‌ సూపర్‌-7 క్రికెట్‌ టోర్నీ బాలుర విభాగంలో తెలంగాణ జట్టు విజేతగా నిలిచింది. మంగళవారం ఎండీసీఏ మైదానంలో జరిగిన ఫైనల్లో మన జట్టు 32 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తుచేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన తెలంగాణ నిర్ణీత ఏడు ఓవర్లలో రెండు వికెట్లకు 101 పరుగులు చేయ గా.. ప్రత్యర్థి జట్టు మూడు వికెట్లు కోల్పోయి 69 పరుగులకే పరితమైంది. బాలికల విభాగంలో తెలంగాణ జట్టు ఫైన ల్‌కు చేరింది. మంగళవారం జరిగిన సెమీస్‌లో ఢిల్లీపై 8వికెట్ల తేడాతో గెలిచిన మన జట్టు.. బుధవారం ఛత్తీస్‌గఢ్‌తో ఫైనల్‌ ఆడనుంది. 


logo