శనివారం 31 అక్టోబర్ 2020
Sports - Sep 26, 2020 , 16:57:35

ఐపీఎల్‌: హోట‌ల్ నుంచి స్టేడియానికి బ‌య‌లుదేరిన‌ SRH టీమ్

ఐపీఎల్‌: హోట‌ల్ నుంచి స్టేడియానికి బ‌య‌లుదేరిన‌ SRH టీమ్

న్యూఢిల్లీ: ఐపీఎల్ మ్యాచ్ ఆడేందుకు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు అబుదాబిలోని హోట‌ల్ నుంచి షేక్ జాయేద్ స్టేడియానికి బ‌య‌లుదేరింది. ఐపీఎల్ సీజ‌న్-13లో భాగంగా ఈ రోజు అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో 8వ మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఈ మ్యాచ్‌లో హైద‌రాబాద్ జ‌ట్టు దినేశ్ కార్తీక్ సార‌థ్యంలోని కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది. కాగా ఈ సీజ‌న్‌లో హైద‌రాబాద్‌కు ఇది రెండో మ్యాచ్. తొలి మ్యాచ్‌లో వార్న‌ర్ సేన విరాట్ కోహ్లీ సార‌థ్యంలోని రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) జ‌ట్టు చేతిలో ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. 

కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టుకు సైతం ఇది రెండో మ్యాచ్‌. ఆ జ‌ట్టు కూడా తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ చేతిలో ప‌రాజ‌యం పాలైంది. తొలి మ్యాచ్‌లలో ఓట‌మి నేప‌థ్యంలో ఇరు జ‌ట్లు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తీరాల‌న్న ప‌ట్టుద‌ల‌తో రంగంలోకి దిగుతున్నాయి.    ‌

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.