గురువారం 26 నవంబర్ 2020
Sports - Sep 21, 2020 , 19:09:54

టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌.. బెంగళూరు బ్యాటింగ్‌

 టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌.. బెంగళూరు బ్యాటింగ్‌

దుబాయ్‌:  ఐపీఎల్‌ 13వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజన్స్‌ బెంగళూరు జట్లు తొలి సమరానికి సై అంటున్నాయి.  డేవిడ్‌ వార్నర్‌ సారథ్యంలోని హైదరాబాద్‌.. కోహ్లీ కెప్టెన్సీలోని బెంగళూరు జట్లూ అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి మ్యాచ్‌లోనే బోణీ చేయాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.   టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. 

2016లో జట్టుకు తొలి టైటిల్‌ అందించిన  డేవిడ్‌ వార్నర్‌ రెండేండ్ల తర్వాత మళ్లీ  జట్టు పగ్గాలు చేపట్టగా.. జానీ బెయిర్‌స్టో, కేన్‌ విలియమ్సన్‌, మనీశ్‌ పాండేలతో  హైదరాబాద్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా కనిపిస్తున్నది. గతేడాది పాయింట్ల పట్టికలో చివర్లో నిలిచిన బెంగళూరు శుభారంభం చేయాలని పట్టుదలతో ఉంది.  స్టార్‌ ప్లేయర్లు  కెప్టెన్‌ కోహ్లీ, డివిలియర్స్‌కు అరోన్‌ ఫించ్‌, క్రిస్‌ మోరిస్‌ తోడవడంతో  ఆ టీమ్‌ మరింత బలోపేతమైంది.